జయలలిత సమాధి వద్ద విశాల్
- December 04, 2017
చెన్నై: తమిళనాట మరో రాజకీయ చదరంగానికి సమయం ఆసన్నమైంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. డిసెంబర్ 21న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండటంతో తమిళ రాజకీయం వేడెక్కుతోంది. సినీ నటుడు విశాల్ కూడా ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ప్రజల్లో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ నెలకొంది. విశాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ జయలలిత సానుభూతిపరుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాడనే సరికొత్త వాదన తెరపైకొచ్చింది.
విశాల్ ఇవాళ నామినేషన్ వేసే ముందుగా జయలలిత సమాధి వద్దకెళ్లి నివాళులర్పించాడు. అంతేకాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కె కామరాజు, ఎంజీఆర్‌లకు కూడా విశాల్ శ్రద్ధాంజలి ఘటించాడు. దీంతో విశాల్ పోటీ వెనుక అన్నాడీఎంకే హస్తం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ వాదనను విశాల్ మద్దతుదారులు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రానికి సేవ చేసిన నాయకుల ఆశీర్వాదం కోసం మాత్రమే విశాల్ వెళ్లారని, దాని వెనుక ఎలాంటి రాజకీయ వ్యూహం లేదని చెప్పుకొస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!