ఇరాన్ లోని చాబహార్ పోర్ట్ ప్రారంభోత్సవ వేడుకకు ఖతార్ మంత్రి హాజరు
- December 04, 2017
ఖతార్ : తొలి దశ నిర్మాణం పూర్తిచేసుకున్న ఇరాన్ లోని చాబహార్ పోర్ట్ ఆదివారం ప్రారంభమైంది. హహీద్ బహెష్తీ పేరు పెట్టిన తొలిదశ ఓడరేవును ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కతర్ మంత్రి జస్సిమ్ సెయిఫ్ అహ్మద్ అల్-సులైటీ పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌లతో వ్యూహాత్మక వాణిజ్య రవాణాకు ఉపయోగపడేలా భారత్ నిర్మించిన తొలి ఓడరేవు ఇదే. భారత్-ఇరాన్-ఆఫ్ఘనిస్థాన్ త్రైపాక్షిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగా దీన్ని నిర్మించారు. తన ప్రాదేశిక జలాల గుండా సరుకురవాణా ఓడల్ని అనుమతించబోనని పాకిస్థాన్ స్పష్టంచేయడంతో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో భారత్ ఈ పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ రాష్ర్టాల మధ్య చాబహార్ పోర్ట్‌ను నిర్మించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని ప్రసంగిస్తూ... ఇరుగుపొరుగు దేశాల మధ్య ప్రాంతీయంగా సత్సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఆశావహ పో టీ అందరికీ మంచిది. మేం మరిన్ని ఓడరేవులు రా వాలని కోరుకుంటున్నాం. చాబహార్ ఓడరేవు అభివృద్ధినీ స్వాగతిస్తున్నాం అని చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి భారత్, ఖతర్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సహా 17 దేశాల 60మంది ప్రతినిధులు హాజరయ్యారని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానెల్ తెలిపింది. ఇప్పుడు ఇరాన్లో హిందూ మహాసముద్రంలో ఏకైక ఏకైక నౌకాశ్రయంగా ఉంది మరియు ఇతర దేశాలతో సంబంధాల అభివృద్ధికి గణనీయంగా సహాయం చేస్తుంది, రవాణా మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!