భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

- December 04, 2017 , by Maagulf
భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

53 ఏళ్ళ వ్యక్తి ఒకరు కింగ్‌ ఫైసల్‌ రోడ్‌లోని ఓ భవనం 10వ అంతస్తు నుంచి కింత పడి మృతి చెందిన ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఉదయం 9.30 నిమిషాల సమయంలో ఘటన గురించిన సమాచారం అందుకోవడం జరిగింది. ఆపరేషన్‌ రూమ్‌కి సమాచారం అందగానే, పెట్రోల్స్‌ మరియు ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్స్‌తో కూడిన టీమ్స్‌ రంగంలోకి దిగాయి. అయితే సంఘటనా స్థలంలోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్‌ లేబరేటరీకి తరలించారు. జరిగింది హత్యా? ఆత్మహత్యా? అనేది విచారణలో తేలుతుందని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఫింగర్‌ ప్రింట్స్‌ సహా పలు సాక్ష్యాల్ని సేకరించారు పోలీసులు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com