'మా' భవనం కోసం ఒకటవ్వనున్న తెలుగుసినీ తారలు!

- December 05, 2017 , by Maagulf
'మా' భవనం కోసం ఒకటవ్వనున్న తెలుగుసినీ తారలు!

ఒకరు ఇద్దరు హీరోలు కలిసి.. కనిపిస్తేనే... అభినులకే కాదు.. సామాన్యులకు కూడా పండగే.. మరి అటువంటిది.. ఒకేసారి తెలుగు అగ్రతారలు అందరూ వేదికపై సందడి చేస్తే... మరి అప్పుడు సినీ అభిమానులకు తీపివార్తే... అవును సొంతం భవనం లేని తెలుగు మూవీ ఆర్టిస్టులు అసోసియేషన్ కోసం ఏకం కానున్నారు.. 

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఏప్రిల్ 10వ తేదీ 1993 లో స్థాపించబడింది.. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ మా కు సొంతం భవనం లేదు.. దీని కోసం ఇప్పటి వరకూ చాలా సార్లు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. నిధుల కొరతతో వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఈసారి 'మా' భవనం నిర్మాణం కోసం ముమ్మర ప్రయత్నాలు చేపట్టినట్లు మా జనరల్ సెక్రటరీ అయిన సీనియర్ నటుడు నరేష్ ప్రకటించారు. సొంతం భవన నిర్మాణం కోసం నిధుల కావాలని.. వాటి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.. ఈ కార్యక్రమం కోసం ఈ నెల 10వ తేదీన కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగబోతున్నది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రదర్శనల ఇవ్వనున్నారు.. సీనియర్ నటులకు సన్మానం చేయనున్నారు. మా భవన నిర్మాణం కోసం చేపట్టనున్న కార్యక్రమానికి సీనియర్ స్టార్స్ కృష్ణ, కృష్ణంరాజు మద్దతు పలుకుతున్నారు.. అంతేకాదు.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు.. పవన్ కల్యాణ్, మహేష్ బాబు లు కూడా తమ వంతు సహాయం చేస్తామని చెప్పినట్లు నరేష్ తెలిపారు.. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ప్రభాస్ లు కూడా భాగం అవుతారని నరేష్ తెలిపారు... ఏది ఏమైనా 'మా' సొంత భవనం నిర్మించడానికి తెలుగు సినీ రంగం అంతా మళ్ళీ ఒకే వేదిక మీదకు రానున్నది అనే వార్తా.. అందరికీ కనుల పండుగ అనే చెప్పాలి...!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com