ఆకట్టుకున్న నేవీ డే వేడుకులు

- December 05, 2017 , by Maagulf
ఆకట్టుకున్న నేవీ డే వేడుకులు

భారీ పేలుళ్లు.. బాంబుల మోతలు.. బుల్లెట్ల శబ్ధాలు.. అరుపులు.. కేకలు.. వేగంగా దూసుకుపోయే యుద్ధ విమానాలు.. శత్రు సైన్యంపై మెరుపు దాడులు.. రయ్ మని దూసుకుపోయే జెమినీ బోట్లు.. ప్రత్యర్థిని తికమక పెడుతూ వేసే ఎత్తుకు పై ఎత్తులు.. వేగంగా వెళ్తున్న విమానం నుంచి సాహసోపేతంగా చేసే స్కై డైవింగ్.. మరోవైపు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సముద్రపు అలలు.. ఏంటి యుద్ధం ఎక్కడ జరుగుతోంది అనుకుంటున్నారా? ఈ విన్యాసాలన్నీ విశాఖలో సాగాయి.. 

విశాఖ సాగర తీరంలో యుద్ధ విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతీ ఏడాది డిసెంబర్ 4వ తేదీన నిర్వహించే నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాగర తీరంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించినట్టు విన్యాసాలు  కనిపించాయి. యుద్ధం సమయంలో మెరుపు వేగంతో ఎలా స్పందిస్తారు.. శత్రు సేనలతో ఎలా తలపడతారు. ఎలాంటి ఆయుధాలతో తలపడతారు.. లాంటి అంశాలను కల్లకు కట్టినట్టు చూపించారు. నేవీ డే విన్యాసాలను తిలకించేందుకు నగరవాసులు వేల సంఖ్యలో హాజరయ్యారు..

ముఖ్యంగా సముద్రం మధ్యలో చేసిన ఆయిల్ రిగ్ బ్లాస్టింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. స్కై డ్రైవర్స్ చేసిన త్రివర్ణ పతాక ప్రదర్శన ఆకట్టుకుంది. ఆకాశంలోంచి మెరుపు వేగంగా చేసిన స్కై డైవింగ్ థ్రిల్ న కల్పించింది. ఈస్ట్రన్ నేవల్ కమాండెంట్ చీఫ్ కరమ్ బీర్ సింగ్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, భూమా అఖిళ ప్రియ తదితరలు వేడుకలను ప్రత్యకంగా తిలకించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com