హఫీజ్‌ సయీద్‌తో పొత్తుకు సిద్ధమే: ముషారఫ్

- December 05, 2017 , by Maagulf
హఫీజ్‌ సయీద్‌తో పొత్తుకు సిద్ధమే: ముషారఫ్

ఇస్లామాబాద్‌ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాతే ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు ఇటీవలే జై కొట్టిన పాక్‌ మాజీ మిలటరీ రూలర్‌.. తాజాగా మరో అడుగు ముం‍దుకేశారు. వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో పొత్తు సిద్దమని ముషారఫ్‌ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పాకిస్తాన్‌లోని ఒక న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘పొత్తు విషయమై నేను వారితో మాట్లాడలేదు, అయితే వారు ముందుకుకొస్తే అహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముషారఫ్‌ చెప్పారు.

గత నెల్లో పాకిస్తాన్‌లోని 23 పార్టీలతో కలిపి  అవామీ ఇత్తేహాద్‌ కూటమిని ముషారఫ్‌ ప్రకటించారు. అయితే కొద్ది రోజుల్లోనూ కూటమి కకావికలైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యే ఒక న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు అతిపెద్ద మద్దతుదారుడిని అని ప్రకటించి సంచలనం సృష్టించారు. ముంబై దాడుల తరువాత హఫీజ్‌ సయీద్‌ని అమెరికా సైతం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని తలమీద 10 మిలియన్‌ డాలర్ల బహుమతిని ప్రకటించింది. పాకిస్తాన్‌లోని పలు మతసంస్థలపై హఫీజ్‌ సయీద్‌ పట్టుసాధించాడు. హఫీజ్‌ సయీద్‌ ఉగ్రవాది కాదని.. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి హఫీజ్‌ సయీద్‌ పేరును తొలగించాలని ముషారఫ్‌ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com