హాలీవుడ్ చిత్రంలో నెపోలియన్
- December 05, 2017
చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నెపోలియన్. గ్రామీణ పాత్రలు, పోలీసు అధికారి వంటి గాంభీర్యమైన పాత్రల్లో తిరుగులేని నటనను ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు. ఆ మధ్య రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగానూ హవా చాటుకున్నారు. అప్పుడప్పుడు ఒకట్రెండు సినిమాల్లో నటిస్తున్న ఆయన త్వరలోనే ఓ హాలీవుడ్ చిత్రంలో కనిపించనున్నారు. 'డెవిల్స్ నైట్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారాయన. వరుస హత్యలతో కూడిన థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అమెరికాలో పారిశ్రామికవేత్తగా ఉన్న భారతీయుడిగా నటించారు నెపోలియన్. డెల్ గణేశన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ లోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!