'వెడ్డింగ్ సాంగ్' విడుదల చేసిన హలో
- December 06, 2017
అక్కినేని అఖిల్ రెండో సినిమా ద్వారా పక్కాగా హిట్ కొట్టాలనే కసితో హలో సినిమా చేసినట్టు తెలుస్తుంది. ఇక నాగార్జున కూడా ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాడని తెలుస్తుంది. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ మధ్యే టీజర్, ట్రైలర్ తో అలరించిన హలో చిత్ర యూనిట్ తాజాగా హలో వెడ్డింగ్ అనే సాంగ్ విడుదల చేసింది. ఈ సాంగ్ కలర్ ఫుల్ గా ఉండటంతో పాటు అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. అనూప్ మరోసారి తనదైన స్టైల్ లో బాణీలు అందించాడు. అఖిల్ నిన్ననే తన ట్విట్టర్ ద్వారా ఓ సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. అది మ్యూజికల్ సర్ ప్రైజ్ అని తాజాగా అర్ధమైంది. ఇక త్వరలో రానా, అఖిల్ లు యూఎస్ కి సినిమా ప్రమోషన్ కోసం వెళ్లనున్నారు. విక్రమ్ కుమార్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!