సలెహ్‌ని దారుణంగా హత్యచేసిన హౌతీస్
- December 06, 2017
యెమెన్ మాజీ అధ్యక్షుడు అలి అబ్దుల్లా సలెహ్ దారుణ హత్యకు గురయ్యారు. హౌతీ మిలిటెంట్ల చేతిలో సలెహ్ హత్య జరిగినట్లు ప్రముఖ వార్తా సంస్థలు ధృవీకరించాయి. ఈ మేరకు వీడియో ఫుటేజీలు దర్శనమిస్తున్నాయి. అల్ హౌదీ మూకలు, సలెహ్ మృతదేహంతో ఆ వీడియోల్లో కనిపించడం సంచలనంగా మారింది. ఆ వీడియోల్లో కనిపించిన వివరాల ప్రకారం సలెహ్ తల వెనుక భాగం ఛిద్రమైంది. జనరల్ పీపుల్స్ కాంగ్రెస్ వర్గాలు చెప్పిన ప్రకారం స్నైపర్స్ సహాయంతో వెనుక నుంచి సలెహ్‌ని కాల్చి చంపినట్లు తెలియవస్తోంది. అత్యంత హేయంగా మృతదేహంతో వ్యవహరించారని హౌతీ తీవ్రవాదులపై జనరల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆరోపించింది. సనాలోని సలెహ్ హౌస్‌ని బాంబులతో ధ్వంసం చేసిన అనంతరం హౌతీలు ఈ హత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







