చంద్రుడిపై రోబో స్టేషన్ నిర్మించనున్న చైనా.!
- December 06, 2017
చంద్రుడి భౌగోళిక స్వరూపంపై పరిశోధనలను మరింత వేగవంతం, విస్తృతం చేసే దిశగా చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఈ పరిశోధనలకు అనుగుణంగా చందమామపై రోబో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చంద్రమండలం నుంచి శిలల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు అవుతున్న భారీ వ్యయాన్ని ఈ స్టేషన్ ఏర్పాటుతో గణనీయంగా తగ్గించవచ్చునని చైనా భావిస్తున్నట్లు స్థానిక వార్తాసంస్థ బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. రోబో స్టేషన్లో పెద్ద సౌరవిద్యుత్తు ఉత్పత్తి యంత్రాన్ని ఏర్పాటుచేస్తారని.. ఫలితంగా చంద్రుడిపై ఇప్పుడున్న రోవర్ల కంటే రోబోల శక్తి సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని తెలిపింది. సంక్లిష్ట పరిశోధనలను సైతం వేగంగా పూర్తిచేసేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. మరోవైపు, అంగారక గ్రహంపై పరిశోధనలకుగాను 2020 లోగా 'లాంగ్‌మార్చ్ 5' ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓ రోవర్‌ను చైనా అంగారకుడిపై మోహరిస్తుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!