'అ' సినిమా ఫస్ట్ లుక్
- December 07, 2017తెలుగు ఇండస్ట్రీలో లక్కీ స్టార్...ఎవరూ అంటే వెంటనే చెబుతారు నేచురల్ స్టార్ నానీ అని..ఎందుకంటే ఓ హీరోకి వరుసగా విజయాలు దక్కడం అనేది చాలా అరుదు. మారుతి దర్శకత్వంలో 'భలే భలే మగాడివోయ్' చిత్రం తర్వాత నానికి వరుసగా విజయాలు దక్కుతున్నాయి. ఈ సంవత్సరం నేను లోకల్, నిన్నుకోరి చిత్రాలతో మంచి విజయం అందుకున్న నాని త్వరలో 'ఎంసిఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) తో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. నటుడిగా రాణిస్తున్న నాని ఇటీవల వాల్ పోస్టర్ అనే ప్రొడక్షన్ సంస్థ స్థాపించి ఈ బేనర్‌పై నిర్మాతగా 'అ' అనే సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీనివాస్ అవసరాల,నిత్యామీనన్,నిత్యామీనన్ రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శిని లీడ్ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని, రవితేజ వాయిస్ ఇవ్వడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 80 శాతం పూర్తి చేసుకుంది. ఇటీవలే నాని తన ట్విట్టర్ ద్వారా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశాడు.
ఆ తర్వాత వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్లో నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలో మరో పోస్టర్ రిలీజ్ చేశారు. అవసరాల నానికి సంబంధించి ఈ లుక్ చూస్తుంటే..పూర్తి సైంటిఫిక్ చిత్రంలా అనిపిస్తుంది..ఎందుంటే మనోడు పెద్ద సైంటిస్ట్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నాడు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!