తెలుగు ఫిల్మ్‌చాంబర్ కీలక నిర్ణయం.!
- December 08, 2017
పండుగలకు డబ్బింగ్ సినిమాల విడుదలపై తెలుగు ఫిల్మ్‌చాంబర్ నిషేధం విధించింది.! ఇవాళ మధ్యాహ్నం తెలుగు ఫిల్మ్‌చాంబర్ ప్రతినిధులు అత్యవసర భేటీ అయ్యారు. భేటీలో పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా పండగలకు డబ్బింగ్ సినిమాలు విడుదలపై సుమారు రెండు గంటలపాటు చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పండుగలకు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయకూడదని నిర్ణయానికొచ్చారు. మరోవైపు డిజిటల్ ప్రసారాల రేట్లను తగ్గించకుంటే వచ్చే మార్చి 1 నుంచి సినిమాలను నిలిపివేయాలని యోచనలో ఉన్నారు. తెలుగు సినిమాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తెలుగువారికి ప్రధాన పండుగలైన సంక్రాంతి, దసరా తెలుగు సినిమాలు మినహా, వేరే ఇతర భాషల్లో అనువదించిన సినిమాలు విడుదల చేయకూడదని ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనే విషయం తెలియరాలేదు. అయితే తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు అనధికారికంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి ఇంత వరకూ స్పష్టత రాలేదు.. ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు కూడా ఎవరూ స్పందించలేదు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!