12 గంటల సేల్‌తో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం
- December 08, 2017
2017 డిసెంబర్ 26 నుంచి 2018 జనవరి 27 వరకు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కి రంగం సిద్ధమవుతోంది. దుబాయ్ టరిజం ఈ విషయాన్ని వెల్లడించింది. నెలరోజులపాటు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్లో పాప్ అప్ ఫ్యాషన్ షోస్, ఫైర్ వర్క్ డిస్ప్లేస్, మెగా సేల్స్ ఇంకా చాలా విశేషాలు షాపింగ్ ప్రియులకు సరికొత్త షాపింగ్ అనుభూతినివ్వనున్నాయి. రెసిడెంట్స్ అలాగే విజిటర్స్ మార్కెట్ ఓటీబీ (బుర్జ్ పార్క్ వద్ద) వద్దకు వెళ్ళి డిజైనర్స్ నుంచి సెలబ్రిటీ మేకప్ టిప్స్‌ని, ట్రిక్స్నీ తెలుసుకోవచ్చు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా అదృష్టవంతులకు రఫాలె డ్రాస్ కళ్ళు చెదిరే బహుమతులతో సిద్ధంగా ఉంటాయి. ఇంకో వైపున ప్రారంభం రోజున ప్రత్యేకంగా 12 గంటల సేల్ ప్రధాన ఆకర్షణ కానుంది. డిసెంబర్ 26న ప్రారంభమయ్యే ఈ స్పెషల్ షాపింగ్, అదనపు డిస్కౌంట్లతో షాపింగ్ ప్రియుల్ని అట్రాక్ట్ చేయనుంది. మాజద్ అల్ ఫుత్తైమ్ మాల్స్‌లో ఈ సేల్ ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







