గుజరాత్‌ లో తొలి దశ పోలింగ్‌ ప్రారంభం..

- December 08, 2017 , by Maagulf
గుజరాత్‌ లో తొలి దశ పోలింగ్‌ ప్రారంభం..

గుజరాత్‌ అసెంబ్లీ తొలి సమరానికి పోలింగ్ కొనసాగుతోంది.‌ ఓటు వేసేందుకు జనాలు పోలింగ్‌ స్టేషన్ల దగ్గరకు జనాలు వస్తున్నారు. చలి వాతావరణం కావడంతో...  పోలింగ్‌ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తం 182 స్థానాల్లో... 89 నియోజకవర్గాల్లో... 977మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తంకానుంది. సౌరాష్ట్రలో 48, సౌత్‌ గుజరాత్‌లో 35, ఖచ్‌లో 6 సీట్లు ఉన్నాయి. ఫస్ట్‌ ఫేజ్‌లో 2కోట్ల 12లక్షల 31వేలమంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. తొలిదశ పోలింగ్‌ బరిలో సీఎం విజయ్‌ రూపానితో పాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఉన్నారు.  

పోలింగ్‌కు సంబంధించి ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. 24వేల 689 బూత్‌లను రెడీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 5 లక్షలమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతోందని వస్తున్న ఆరోపణలతో... ఈసారి ఓటర్‌ వెరిఫయేబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ VVPATను ఉపయోగిస్తోంది. అంటే ఓటు వేసిన వ్యక్తికి ఓ స్లిప్‌పై ఫీడ్‌ బ్యాక్‌ వస్తుంది. ఓటరు ఎవరికి ఓటు వేశారో అనేది దానిపై ముద్రిస్తుంది. 

పోలింగ్‌కు ఈసీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. లక్షమంది పోలీసు, పారా మిలటరీలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా బలగాలను రంగంలోకి దించారు. అక్కడక్కడా చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇటు పోలింగ్‌ జరుగుతుంటే... ఓటరు కరుణతో పాటు దేవుడి కటాక్షం కోసం ప్రయత్నిస్తున్నారు నేతలు. ఎన్నికల్లో విజయం కోసం గుడుల చుట్టూ తిరుగుతున్నారు. సీఎం రూపానీ, పీసీసీ చీఫ్‌ జితూ భాయ్‌ వాఘానీలు ప్రత్యేక పూజలు చేశారు. ఇద్దరు నేతలు కుటుంబ సమేతంగా శివుడికి అభిషేకం నిర్వహించారు. అలాగే మరికొందరు నేతలు కూడా ఆలయాల బాటపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com