ఐఆర్‌సీటీసీ వారి ఆఫర్‌

- December 09, 2017 , by Maagulf
ఐఆర్‌సీటీసీ వారి ఆఫర్‌

దేశీయ రైల్వే బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. భీమ్‌ యాప్‌ లేదా యూపీఐ ద్వారా రైల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడానికి నెలవారీ లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ డ్రాలో గెలుపొందిన వారికి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. భీమ్‌ యాప్‌ లేదా యూపీఐ పేమెంట్‌ ఆప్షన్లను వాడే వారి కోసం గత నెలలోనే ఈ స్కీమ్‌ను దేశీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లాంచ్‌ చేసింది. ఆరు నెలల కాలంలో ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది.

ప్రతి నెలా తొలి వారంలో ముందటి నెలలోని ఐదుగురు లక్కీ ప్రయాణికులను కంప్యూటరైజడ్‌ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈ డ్రాలో గెలుపొందిన ఐదుగురికి మొత్తం రైల్వే టిక్కెట్‌ ధరను వెనక్కి ఇచ్చేస్తారు. భీమ్‌ లేదా యూపీఐ ఆప్షన్ల ద్వారా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌పై ఈ-టిక్కెట్లను విజయవంతంగా బుక్‌ చేసుకున్న కస్టమర్లు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు అవుతారని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. టిక్కెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు, పీఎన్‌ఆర్‌లకు వ్యతిరేకంగా టీడీఆర్‌ ఫైల్‌ చేసిన వారు ఈ స్కీమ్‌కు అర్హులు కారని తెలిపింది. డిసెంబర్‌1 నుంచి భీమ్‌ యాప్‌ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్‌ చేసుకునే అనుమతిని రైల్వే అందిస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com