కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ
- November 16, 2015
రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. ఐడీహెచ్ కాలనీలో జరిగిన కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తలసాని అధ్యక్షత వహించారు. ఇంకా మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తనకు ఇవాళ సంతోషకరమైన రోజు అన్నారు. పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి వారిని సొంతింటి వారిని చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మొత్తం 396 ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం అధికారులు ఎంపిక చేసిన ఐదుగురికి సీఎం పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఆనందంతో సీఎంకు పాదాభివందనం చేయడం కనిపించింది. వద్దంటూ సీఎం వారిని వారిస్తూ సుతిమెత్తగా పక్కకు జరిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







