రైలు ప్రమాదం లో ఆరు ఏనుగులు మృతి

- December 10, 2017 , by Maagulf
రైలు ప్రమాదం లో ఆరు ఏనుగులు మృతి

అత్యంత హృదయవిదారకమైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఐదు పెద్ద ఏనుగులు, ఓ చిన్న ఏనుగు పిల్ల దుర్మరణం పాలయ్యాయి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో గువాహటి-నహర్లాగున్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ ఏనుగులను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లా, బలిపర సమీపంలో ఈ దారుణం జరిగింది. ఈ ప్రాంతానికి ఏనుగుల వాటికగా మంచి పేరు ఉంది. గ్రామాలు విస్తరిస్తుండటంతో అడవుల నరికివేత జోరుగా సాగుతోంది. సోనిత్‌పూర్‌లో 70 శాతం అడవులు కనుమరుగయ్యాయి. అడవుల్లో నివసించే జంతువులకు రక్షణ ఉండటం లేదు. 2013-2016 సంవత్సరాల మధ్య దాదాపు 140 ఏనుగులు అసహజంగా మరణించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com