ఒక ఇంటిలో పెద్ద మొత్తంలో తుపాకులు లభించాయని సోషల్ మీడియా వార్త తప్పు !!

- December 10, 2017 , by Maagulf
ఒక ఇంటిలో పెద్ద మొత్తంలో తుపాకులు లభించాయని  సోషల్ మీడియా వార్త తప్పు !!

కువైట్: '  ఇదిగో ...తోక  ఆంటీ...అదిగో ...పులి '  అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పుకారు  వార్తలు లోకమంతా చుట్టి వస్తున్నాయి.  ఫ్యూహద్ అల్-అహ్మద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక గృహంలో పెద్ద మొత్తంలో ఆయుధాలను కనుగొన్నారని  సోషల్ మీడియా సైట్లు శనివారం కోడై కూశాయి. అయితే, ఆ  నివేదికలు వట్టి అసత్యమని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఖండించాయి. ఆ ఆయుధాల చిత్రాలు ఫోటోషాప్ లో సవరించబడిన ఓ ప్రక్రియగా ఎవరి ద్వారానో  చిత్రీకరించబడ్డాయి మరియు అందరకి సామాజిక మాధ్యామాల ద్వారా పంపబడ్డాయి. అవి అవాస్తవ కల్పనని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అధికారి వివరించారు. నిజానికైతే , కొంతకాలం క్రితం నిర్మాణంలో ఉన్న ఆ  ఇంట్లో ఒక తుపాకీ కనుగొనబడింది. ఆ ఆయుధాన్ని ఒక వారం క్రితం క్రిమినల్ మరియు సెక్యూరిటీ విభాగం ద్వారా స్వాధీనం చేసుఓబడింది. తప్పుడు వార్తలు లేదా తప్పుడు చిత్రాలు ముఖ్యంగా, సోషల్ మీడియా నెట్ లలో పంపిణీ కావడంపై వర్క్ సైట్లు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఎవరికైన సందేహాలు ఉంటే, నేరుగా తమని అడగవచ్చని  అందుకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ శాఖ సమాధానమివ్వటానికి తలుపులు తెరిచే ఉంటాయని ఆయన సూచించారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com