అమెరికాలో కూలిన లఘు విమానం
- December 10, 2017వాషింగ్టన్: అమెరికాలోని శాండీగో నగరంలో ని ఓ ఇంటిపై లఘు విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...శాండీగో నగరంలో ఓ ఇంటిపై లఘు విమానం కూలిపోయింది.
దీంతో, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఇద్దరు వ్యక్తులు ఈ మంటల్లో కాలిపోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. విమానం కూలిన ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం పూర్తిగా కాలిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. విమానం కూలిన ప్రాంతం శాండీగో విమానాశ్రయం నుంచి కూతవేటు దూరంలో ఉంటుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..