'శివ' సినిమా తొలిసారి చూస్తే నచ్చలేదు అంటోన్న అఖిల్...
- December 10, 2017
అక్కినేని మూడో తరం వారసుడు.. అఖిల్ అక్కినేని 'అఖిల్' సినిమాతో హీరోగా తెరం గ్రేటం చేశాడు. తాజాగా హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నాడు.. కాగా అఖిల్ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన అమ్మానాన్న నాగార్జున అమల జంటగా నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ "శివ" సినిమాను తొలిసారి చూసినప్పుడు అసలు తనకు నచ్చలేదని చెప్పాడు.. బహుశా తను అప్పుడు చిన్న పిల్లవాడిని కావడం వల్ల తనకు సినిమా అర్ధం కాలేదేమో.. అని కూడా అన్నాడు.. ఆ తర్వాత శివ సినిమాను ఇప్పటికి 22 సార్లు చూసినట్లు.. 16 వ సారి చూసినప్పుడు తనకు శివ సినిమా నచ్చింది అని చెప్పాడు.. అంటే తనకు శివ సినిమాను అర్ధం చేసుకొనే వయసు అప్పుడు నాకు వచ్చింది అని అనుకుంటా అని అఖిల్ చెప్పాడు.. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆధునిక సినిమా లో శివ కు ముందు ఆ తర్వాత అనే విధంగా చెప్పే వారు కూడా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతోనే వెండి తెరపై దర్శకుడుగా అడుగు పెట్టాడు. అన్న సంగతి విధితమే..!!
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల