శ్రీనివాస్ కూచిభొట్లను కాపాడబోయిన గ్రిల్లోట్‌కి లభించిన గౌరవం
- December 11, 2017
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగిన కాన్సాస్ కాల్పుల్లో భారతీయులను కాపాడబోయిన ఇయాన్ గ్రిల్లోట్‌కి అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ ప్రతిఏటా ప్రకటించే సాహసవీరుల జాబితాలో ఆయన పేరును కూడా ప్రకటించింది. ''2017లో మనలో ఆశలు నింపిన 5గురు హీరోలు'' అంటూ టైమ్ మ్యాగజైన్ ఈ జాబితా విడుదల చేసింది. భారత యువకులు శ్రీనివాస్ కూచిభొట్ల, ఆయన స్నేహితుడు అలోక్ మాదసానిపై ఓ మాజీ నేవీ ఉద్యోగి కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శ్రీనివాస్ మృతిచెందగా.. అలోక్ ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పులకు తెగబడిన ఉన్మాదిని అడ్డుకునేందుకు 24 ఏళ్ల అమెరికా యువకుడు గ్రిల్లోట్ ప్రాణాలకు తెగించాడు. ఈ క్రమంలో అతడి చాతీలోకి ఓ బుల్లెట్ కూడా దూసుకెళ్లింది. ''అక్కడ నేనేమీ చేయకుండా ఉండిఉంటే... నేను నేనుగా బ్రతకలేకపోయేవాడిని..'' అని గ్రిల్లోట్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక