ఆ కళ్యాణ్ బాబుతో ఈ కళ్యాణ్ బాబు కలిసిపోతాడా?

- December 11, 2017 , by Maagulf
ఆ కళ్యాణ్ బాబుతో ఈ కళ్యాణ్ బాబు కలిసిపోతాడా?

ఎట్టకేలకు చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ రెండో భర్త కళ్యాణ్ కానుగంటి తెరంగేట్రం ఖరారైంది. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించే మూవీలో కళ్యాణ్ హీరో వేషం వేస్తున్నాడు. వారాహి చలన చిత్ర బేనర్లో సాయి కొర్రపాటి దీన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. కళ్యాణ్‌ పక్కన ఫిమేల్ రోల్ కోసం అనుపమ పరమేశ్వరన్‌ బుక్ అయ్యిందని తాజా ఫిల్మ్ నగర్ ఇన్ పుట్స్ చెబుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌, రవితేజ, మహేష్ , ప్రభాస్‌, వరుణ్‌ తేజ్‌ లాంటి మెయిన్ స్ట్రీమ్ హీరోల్ని 'చక్కదిద్దిన' సత్యానంద్ దగ్గరే.. ఈ కళ్యాణ్ కూడా ట్రైనింగ్ తీసుకున్నాడట. మొత్తానికి 'కళ్యాణ్ కానుగంటి' అనే కొత్తబ్బాయిని మంచి కమర్షియల్ హీరోగా టాలీవుడ్ కి పరిచయం చెయ్యడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగినట్లే లెక్క!

ఏడాదిన్నర ముందువరకు ఒక ఎన్నారై బిజినెస్ మాన్ గా మాత్రమే బైటి ప్రపంచానికి తెలిసిన కళ్యాణ్ కానుగంటి.. ఇప్పుడు మెగా హీరోల జాబితాలో చేరిపోయాడు. జనవరిలో సెట్స్ మీదకెళ్లే ఇతడి డెబ్యూ మూవీ మీద ఇప్పటికే సినీ మీడియా హోరెత్తిస్తోంది. చిరంజీవి తమ్ముళ్లు, చిరంజీవి కొడుకు, చిరంజీవి తమ్ముడి కొడుకు, చిరంజీవి బామ్మర్ది కొడుకులు, చిరంజీవి సోదరి కొడుకు, ఇలా ఇప్పటికే చాంతాడంత పొడవెక్కిన మెగా హీరోల జాబితాలో..

ఈ కళ్యాణ్ కూడా చేరిపోయినట్లు రాసేసుకుంది సోషల్ మీడియా. ఇప్పుడున్న మెగా హీరోలు గానీ, మెగా 'రెడీ మేడ్' ఫ్యాన్ క్లబ్ గానీ ఈ కొత్త ఎంట్రీని ఎలా తీసుకుంటారు? మెగా హీరోలకిచ్చిన ఈలలు-గోలలు, గౌరవ మర్యాదలు, కలెక్షన్లు గట్రా ఇతడికీ దొరుకుతాయా? పవన్ కళ్యాణ్ కొణిదెలనీ, ఈ కళ్యాణ్ కానుగంటినీ ఒకే గాటన కట్టడానికి మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఈ అంశాలన్నీ కొత్త హీరో కళ్యాణ్ కెరీర్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపేవే!
 
మంచి లుక్, పటిష్టమైన ఫిజిక్, హీరోనవ్వాలన్న కసీ, కమిట్మెంట్ అన్నీ కలిపి చూసుకుంటే.. ఈ కళ్యాణ్ కి 'మెగా' ట్యాగ్ అవసరం ఉండబోదనే కాంప్లిమెంట్స్ కూడా ఫిలిం నగర్లో గట్టిగా వినిపిస్తున్నాయి. మంచి లవ్ స్టోరీతో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ కొత్త కళ్యాణ్ బాబు.. తెర మీద చేసే పెర్ఫామెన్స్ ని చూసేదాకా ఫైనల్ 'జడ్జిమెంట్' పెండింగ్ లో ఉంచాల్సిందే! అప్పటిదాకా కళ్యాణ్ కానుగంటి 'తొలి ప్రేమ' ఫలవంతం కావాలని ఆశిద్దాం!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com