కొత్త పన్నులను ప్రవేశపెట్టడానికి యూఏఈ అన్వేషణ
- December 11, 2017
యూఏఈ : నూతన ఏడాదికి కొత్త పన్నులు యూఏఈ లో సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం వచ్చే నెలలో అమలులోకి తీసుకురానున్న5 శాతం విలువ ఆధారిత పన్ను (వాట్) తో పాటు కొత్త పన్నులను ప్రవేశపెట్టాలని యుపిఎ ప్రభుత్వం భావిస్తోంది. కాని ఆదాయ పన్నును ప్రవేశపెట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యుత్తమ అంతర్జాతీయ విధానాల ప్రకారం యూఏఈ ఇతర పన్నుల ఎంపికలను పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది." ఈ ఎంపికలు ఇప్పటికీ విశ్లేషణలో మరియు వాటిపై అధ్యయనం జరుగుతున్నాయి మరియు సమీప భవిష్యత్‌లో అవి పరిచయం చేయబడవు. యూఏఈ ప్రస్తుతం ఆదాయ పన్నును ప్రవేశపెట్టడం లేదు. "సౌదీ అరేబియా మరియు యుఎఇలలో 2018 జనవరి1 వ తేదీ నుంచి వ్యాట్ ( విలువ ఆధారిత పన్ను)ను ప్రవేశపెడతాయి. దీంతో వ్యాట్ పన్ను ను అమలుచేసే అరేబియా గల్ఫ్ లోని తొలి దేశంగా యూఏఈ ప్రసిద్ధి చెందనుంది. అదేవిధంగా గత అక్టోబర్ నుంచి యుఎఇ, పొగాకుపై , శక్తిని ఇచ్చే పానీయాలపై ఎక్సైజ్ పన్ను 100 శాతం అమలుచేస్తోంది. అలాగే శీతలపానీయాలపై 50 శాతం చొప్పున పన్నును ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, పర్యావరణ సమస్యలను అధిగమించడానికి ఈ నూతన పన్నుల పెంపుదల అనివార్యమైంది. చమురు నుండి ప్రభుత్వ ఆదాయం క్షీణించడంతో ఆ లోటుని భర్తీ చేయడానికి యూఏఈ మరియు ఇతర ఐదు అరేబియా గల్ఫ్ రాష్ట్రాలు ఈ తరహా పన్నులను ప్రజలకు పరిచయం చేయక తప్పడం లేదు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!