త్వరలో వాట్సప్ బిజినెస్ యాప్.!
- December 11, 2017
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించుకోబడుతోన్న మొబైల్ యాప్‌లలో వాట్సప్ ఒకటి. ఈ యాప్‌ను వ్యక్తిగత అవసరాలతో పాటు వ్యాపార ప్రయోజనాల నిమిత్తం కూడా ఎక్కువుగా వాడుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఇటువంటి ట్రెండ్ ఎక్కువుగా కనిపిస్తోంది. వాట్సప్ ద్వారా వ్యాపార లావాదేవీలు ఊపందుకున్న నేపథ్యంలో బిజినెస్ పీపుల్ కోసం సరికొత్త వాట్సప్ వర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సప్ రంగం సిద్దం చేసుకుంటోంది.
ఇటీవల తన వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసిన ప్రీక్వెంట్లీ ఆస్కుడ్ క్వచ్చిన్స్ (ఎఫ్ఏక్యూ)లో భాగంగా వాట్సప్ బిజినెస్ అకౌంట్లకు సంబంధించి కొత్త సమాచారాన్ని కంపెనీ రివీల్ చేసింది. ముఖ్యంగా వెరిఫైడ్, నాన్-వెరిఫైడ్ అకౌంట్‌ల మధ్య తేడాలను ఇందులో ప్రస్తావించింది.
బిజినెస్ పీపుల్‌తో చాట్ చేసేముందు వారి కాంటాక్ట్ ప్రొఫైల్‌ను చెక్ చేసినట్లయితే అది వెరిఫైడ్ అకౌంటో కాదో తెలుసుకోవచ్చు. వెరిఫైడ్ అకౌంట్‌కు సంబంధించిన ప్రొఫైల్ పై గ్రీన్ చెక్ మార్క్ బ్యాడ్జ్ ఉంటుంది. ప్రొఫైల్ పై గ్రే క్వచ్చిన మార్క్ బ్యాడ్జ్ ఉన్నట్లయితే ఆ అకౌంట్‌ను వైరిఫైడ్ కానిదిగా భావించాలని వాట్సప్ తెలిపింది.
హైక్ నుంచి బోలెడన్ని స్టిక్కర్లు!
ప్రస్తుతానికి వాట్సప్ బిజినెస్ యాప్‌ను ఓ ప్రయివేట్ గ్రూపుకు చెందిన టెస్టర్స్ ద్వారా పరీక్షిస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. త్వరలోనే దీన్ని ప్రత్యేకమైన యాప్‌గా వాట్సాప్ పరిచయం చేయబోతోంది. రెగ్యులర్ వాట్సాప్‌తో పోలిస్తే వాట్సప్ బిజినెస్ భిన్నంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఆటో రెస్పాన్సస్, క్రియేటింగ్ ఏ బిజినెస్ ప్రొఫైల్, చాట్ మైగ్రేషన్, అనలిటిక్స్ వంటి ఆసక్తికర ఫీచర్లు ఈ వర్షన్‌లో ఉండబోతున్నాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!