మహిళల రక్షణ కోసం 'వన్‌స్టాప్ సెంటర్'
- December 12, 2017
నల్లగొండ జిల్లా: మహిళల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గృహ హింసతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం వన్‌స్టాప్ సెంటర్(ఒకే కేంద్రం)లో పలు అంశాలను గుర్తించి వాటిపై దృష్టి సారించనున్నారు. ఈ వన్ స్టాప్ సెంటర్ కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్జీవోల ఆధ్వర్యంలో నడవనుంది. ఈ కేంద్రంలో గృహ హింస సమస్యలు, భార్యాభర్తల గొడవలు, వరకట్న సమస్యలు, అత్యాచార ఘటనలు, అత్యవసర చికిత్సలు వంటి వాటిపై ఈ సెంటర్ దృష్టి సారించ నుంది. ఇప్పటికే ప్రభుత్వం ఐసీడీఎస్‌లో వికలాంగుల సంస్థతోపాటు వయోవృద్ధుల శాఖను కూడా విలీనం చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలు, పిల్లల పోషణతోపాటు వారిలో మానసిక, శారీరక, సామాజిక ఎదుగుదల కోసం చర్యలు చేపడుతున్నారు. శిశుమరణాల రేటును తగ్గించ డం, పిల్లల పోషకాహార లోపాన్ని, అనారో గ్యాల పరిస్థితులను గుర్తించి వారు పాఠశాలలు మాని వేయకుండా చూసే కార్య క్రమం చేపడుతున్నారు. మాతాశిశు అభివృద్ధితో పాటు మహిళల సంరక్షణే లక్ష్యంగా వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్జీవోల ఆధ్వర్యంలో సెంటర్:
జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్జీవోల ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరోనెల రోజుల్లో పూర్తిస్థాయిలో వన్‌స్టాప్ సెంటర్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో ప్రారంభించ నున్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో సమస్యలు పరిష్క రించడం కోసం గ్రామ సమాఖ్య లను ఏర్పాటు చేసి అందులో సభ్యులను నియ మించను న్నారు. ఈ సభ్యులు గ్రామా ల్లో మహిళలు ఎదు ర్కొంటున్న పలు సమస్యలను గుర్తించి వన్ స్టాప్ సెంటర్‌కు చేరవేయడం ద్వారా వారి సమస్య లను పరిష్కరించడంతోపాటు అవసరమైతే సమస్య లను బట్టి వారికి కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. ఇక పోతే ఈ కేంద్రం ద్వారా భర్తలు వదిలేసిన మహిళ లకు, నిరాదరణకు గురైన, లైంగిక వేధింపులకు గురైన వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. వాస్తవానికి మహిళల సంరక్షణ కోసం బలమైన చట్టాలు చేయాల్సిఉంది. అయితే చట్టాల్లో ఉన్న లోపాలను ఆసరా చేసుకుని మహిళ లపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు, దాడులకు పాల్పడుతు న్నారు. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 'వన్‌స్టాప్ సెంటర్'ను అమలులోకి తీసుకు వస్తుంది.
24 గంటలు అందుబాటులో..
ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. దానిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఈ సెం టర్‌ను 24గంటల పాటు అందుబాటులో ఉంచేం దుకు ప్రభుత్వం నిర్ణయించింది. 24గంటలు వన్ స్టాప్ సెంటర్ అందుబాటులో ఉన్నట్లయితే బాధి తులు ఎప్పుడైనా ఆ సెంటర్‌కు వెళ్లి తమ సమస్య లను చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎన్‌జీ వోల ఆధ్వర్యంలో నడవనున్నందున సదరు శాఖతో పాటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మండ లాలు, గ్రామాల వారీగా సమీక్షలు చేసి వారు ఎదు ర్కొంటున్న సమస్యలకు ఏ మాత్రం పరిష్కారం లభిస్తుందనేది తెలియనుంది. మొత్తానికి ప్రభుత్వం తీసు కుంటున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మహిళలకు ఉపయోగం ఉంటుంది. అయితే అది ఆచరణలో అమలు చేయడం కోసం ఎన్జీవోలు తీవ్రంగా కృషి చేయడంతోపాటు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే ఎన్ని పథకాలు అమలు చేసిన ప్పటికీ నిష్ప్రయోజనంగా మారే అవకాశాలుంటాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!