అశోక్ గజపతిరాజు: గన్నవరం ఎయిర్పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం
- December 13, 2017
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈనెల 19వతేదీన గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా... మధ్యాహ్నం 1.30 సీప్లేన్ ట్రయల్ రన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఆశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల