అసలే చాదస్తం.. పెళ్లయ్యాక అది కాస్త పెరిగింది: సమంత

- December 13, 2017 , by Maagulf
అసలే చాదస్తం.. పెళ్లయ్యాక అది కాస్త పెరిగింది: సమంత

నాక్కొంచెం తిక్కుంది..అయితే దానికో లెక్కుంది అంటాడు పవన్ ఓ సినిమాలో.. సేమ్ అదే వెర్షన్‌.. కాకపోతే కొంచెం మార్చి.. సమంత కూడా తనకి కథల్ని ఎంచుకునే విషయంలో కొంచెం చాదస్తాన్ని చూపిస్తుందట. చేతిలో కొచ్చిన కథలకి ఏదో ఒక సాకు చూపించి నో చెప్తానంటోంది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు ఓ సినిమాకి నో చెప్పాలంటే అది నచ్చలేదు..ఇది నచ్చలేదు అని వచ్చిన కథల్లో తప్పుల్ని వెదికే అలవాటున్న సమంత పెళ్లయ్యాక అది కాస్త ఎక్కువైందంటోంది. శ్రీమతిగా మారాక పెద్దగా మార్పు లేకపోయినా కథల ఎంపికలో మాత్రం మరి కొంత కేర్ కనబరుస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శామ్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com