ఇదే నా క్రిస్మస్ గిఫ్ట్: ట్రంప్

- December 13, 2017 , by Maagulf
ఇదే నా క్రిస్మస్ గిఫ్ట్: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌ అమెరికన్లకు క్రిస్మస్‌ గిఫ్ట్‌ అందిస్తున్నట్టు చెప్పారు.  దేశ ప్రజలకు ఉద్యోగాలు, పన్నుల  చెల్లింపులో భారీ ఊరటనందించే పన్ను చట్టంపై కాంగ్రెస్ లో ఒక ఒప్పందం కుదిరిందని ట్రంప్  ప్రకటించారు. 2016  ఎన్నికల ప్రచారం సందర్భంగా  తానిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఇంకా కొన్ని రోజుల దూరంలోనే ఉన్నామని ఆయన తెలిపారు. ఈ పన్ను సంస్కరణ అమెరికన్ కుటుంబాలకు, దేశీయ కంపెనీలకు  క్రిస్మస్‌ గిఫ్ట్‌ కానుందని పేర్కొన్నారు.  ఇది నిజంగా అద్భుతమైన విజయాన్ని అందించడమేనని  ట్రంప్‌ వెల్లడించారు.

తమ కొత్త పన‍్ను సంస్కరణ చట్టం దేశంలోని అనేకమందికి భారీ ప్రయోజనాలు కలగనున్నాయన్నారు.  అమెరికాలోని పెద్ద, చిన్న వ్యాపారస్తులు చెల్లించే పన్నులు గణనీయంగా తగ్గి,  మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారి తీయడంతో పాటు,  ప్రపంచ దేశాలతో  పోటీ పడతారని ట్రంప్‌ ఉటంకించారు. ట్రిలియన్ల కొద్దీ విదేశీ డాలర్లు... అమెరికాకు  తీసుకొచ్చే ప్రణాళికలో ఉన్నట్టు చెప్పారు. మరిన్ని ఉద్యోగాలు, భారీ వేతనాలు, భారీ పన్నుల ఉపశమనం కలగనుందన‍్నారు.

ముఖ్యంగా ఆపిల్‌ లాంటి దిగ్గజ కంపెనీలు  విదేశీ బిలియన్ల డాలర్లను  దేశానికి తీసుకు రానున్నాయని ట్రంప్‌ తెలిపారు. ఆ డబ్బును దేశీయంగా ఖర్చు చేస్తామని,  దీంతో  ఉద్యోగాలు కల్పన లాంటి మరెన్నో ప్రయోజనాల చేకూరనున్నాయని వివరించారు.  ప్రస్తుత పన్ను విధానం భారంతో పాటు, సంక్లిష్టతతో కూడుకొని ఉందన్నారు. పారిశ్రామిక ప్రపంచంతో పోలిస్తే..అమెరికాలో అత్యధికంగా 35 శాతం పన్ను చెల్లిస్తున్నారని దీన్నితాము బాగా తగ్గిస్తున్నామని ట్రంప్‌  తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com