ఫిబ్రవరి 9న ‘గాయత్రి’ రిలీజ్
- December 13, 2017
విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘గాయత్రి’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విష్ణు సరసన శ్రియ నటించగా, ఇటీవలే వీరిరువురిపై కీలక సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు.
నిఖిలా విమల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, నిర్మాతలు ఫిబ్రవరి 9, 2018 ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇతర ముఖ్య పాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల