నటుడు వినోద్ కుమార్ అరెస్ట్
- November 16, 2015
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వ్యక్తిగత మేనేజర్‌పై హత్యాయత్నం చేసిన ప్రముఖ నటుడు వినోద్ కుమార్‌ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత కొన్నేళ్లుగా నటుడు వినోద్ కుమార్‌కు వ్యక్తిగత మేనేజర్‌గా సచ్చిదానంద కొనసాగేవారు. వినోద్ కుమార్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వినోద్ కుమార్.. మేనేజర్ సచ్చిదానందపై హత్యాయత్నానికి సిద్ధమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. సచ్చిదానంద పుత్తూరు పరిధిలోని సంప్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు దాడికి యత్నించిన విషయం వాస్తవమని గుర్తించినట్లు తెలుస్తోంది. వినోద్ కుమార్ స్వగ్రామమైన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా ఈశ్వర మంగలలో నటుడిని అరెస్ట్ చేసి తరలించారు. వినోద్ కుమార్ కన్నడ, తెలుగు, తమిళ భాషలలో నటుడిగా గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









