లుంగీ డాన్స్ తో మనసుల్ని దోచేస్తున్న శివగామి

- December 14, 2017 , by Maagulf
లుంగీ డాన్స్ తో మనసుల్ని దోచేస్తున్న శివగామి

తమిళ్ స్టార్ సూర్య తాజా చిత్రం "తానా సెరిందా కూట్టం". తెలుగులో 'గ్యాంగ్'గా వస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకుడు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, సెంధిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి విడుదలయిన ఓ పోస్టర్ లో సూర్య, రమ్యకృష్ణ అండ్ గ్యాంగ్ లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టడం ఆకట్టుకొంటోంది.

అక్షయ్ కుమార్ "స్పెషల్ ఛబ్బీస్"కి రీమేక్ ఇది. సూర్య సరసన కీర్తి సురేష్ జతకట్టనుంది. సినిమాలో సూర్య సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం సూర్య స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. 'గ్యాంగ్ ' టీజర్'లో సూర్య వాయిస్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంగీతం అనిరుధ్. స్టూడియో గ్రీన్ బేనర్ పై సత్యన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com