రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నారా బ్రాహ్మణి
- December 14, 2017
ఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న హెరిటేజ్ సంస్థకు అవార్డు లభించింది. దేశంలో ఇంధన ఆదాలో ప్రతిభ కనబరిచిన పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అయితే... ఇందులో హెరిటేజ్ సంస్థ కూడా ఉండడం గమనార్హం. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ ఇంధన ఆదా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తదితరులు విచ్చేశారు. కాగా... అవార్డులకు ఎంపికైన సంస్థల ప్రతినిధులకు రాష్ట్రపతి, కేంద్ర మంతి అవార్డులను ప్రదానం చేయనుండగా హెరిటేజ్ సంస్థ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న నారా బ్రాహ్మణి ఈ అవార్డును మరికాసేపట్లో అందుకోనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







