మనసున్న మారాజు దుబాయి యువరాజు..
- December 14, 2017_1513257334.jpg)
యూఏఈ: కాస్తంత రాజకీయాలలోకి వస్తే చాలు ..గంజి పెట్టిన ఖద్దరు ఇస్త్రీ చొక్కాతో...మడతలు నల్గకుండా..సామాన్యులైన ప్రజలను ఆమడ దూరం పెట్టె ప్రజా ప్రతినిధులను చూసిన మనకు దుబాయ్ యువరాజు కలివిడితనం...అతి సాధారణ వ్యక్తులతో వ్యవహరించే విధానం ఆశ్చర్యపరుస్తుంది. దుబాయి నగరంలో ఓ ఆసుపత్రిలో యూఏఈ పౌరుడైన ఓ వృద్ధుడు చికిత్స తీసుకుంటున్నాడు. బందువులకు తప్ప ఎవరికీ ఆ వృద్ధుడు గురించి తెలియదు. కానీ బుధవారం జరిగిన ఒక ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఆ పెద్దాయన ప్రముఖుడయ్యాడు . సాక్షాత్తూ దుబాయి యువరాజు, దుబాయి ఎగ్జిగ్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆ ఆసుపత్రికి వెళ్లారు. అనూహ్యంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ వృద్ధుడిని పలకరించారు. ఆ వృద్ధుడిని హత్తుకుని, ముక్కును పట్టుకుని అచ్చం తన ముక్కులాగే ఉందని చెబుతూ సరదాగా గడిపారు. ఆ వృద్ధుడి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నానంటూ ఓ వీడియోను బుధవారం తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు రికార్డు స్థాయిలో కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. హమ్దాన్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. దేశ పాలకుడి స్థాయిలో ఉండి కూడా.. సాధారణ పౌరులతో ఇంత స్వేచ్ఛగా, కల్మషం లేకుండా గడపడం దుబాయి రాజవంశీకులకే చెల్లిందని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోను ఇప్పటికే 1.3 మిలియన్ల మంది వీక్షించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!