యోగి ఆశీస్సులుంటే గోరఖ్‌పూర్ నుంచి రవికిషన్
- December 15, 2017
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశీస్సులు లభించినట్లైతే తాను గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని టాలీవుడ్ ప్రజలకు సుపరిచితుడైన సినీ విలన్, భోజ్‌పురి హీరో రవికిషన్ తెలిపారు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'రేసుగుర్రం' చిత్రంలో ఆయన విలన్‌గా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
కాగా, ఇటీవలే రవిశంకర్ కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడంతో గోరఖ్‌పూర్ ఎంపీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.
ఉపఎన్నికలో.. గోరఖ్‌పూర్‌పై ఆసక్తి
గోరఖ్‌పూర్ ఎంపీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు రవికిషన్ ఆసక్తి చూపుతున్నారు.
నిర్ణయం తీసుకోలేదు.. బీజేపీకి కంచుకోట..
25ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్ ఎంపీ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే విషయంలో యోగి ఆదిత్యనాథ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
బీజేపీలో చేరిక..మనోజ్ తివారీ చొరవతో..
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రవికిషన్.. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చొరవతో పార్టీ మారారు. 2009లో మనోజ్ తివారీ సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నప్పుడు గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేసి ఓడిపోయారు.
వేచిచూడాల్సిందే.. తివారీ మద్దతుంది కానీ..
ఆ తర్వాత బీజేపీలో చేరి 2014లో ఢిల్లీలో ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే, మనోజ్ తివారీ మద్దతు ఉన్న రవికిషన్‌కు గోరఖ్‌పూర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందో లేదో వేచిచూడాలి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







