అజ్మన్‌లో అగ్ని ప్రమాదం: ఒకరి మృతి
- December 17, 2017
అజ్మన్ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 రిటైయిల్ ప్లేసెస్ దగ్ధమయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందారు. అజ్మన్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్‌అజీజ్ అల్ షామ్షి ఈ ఘటనపై మాట్లాడుతూ, సాయంత్రం 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదంపై ఫిర్యాదు అందిందనీ, నిమిషాల వ్యవధిలోనే ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేసినట్లు చెప్పారు. గాలుల ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు ఆయన వివరించారాయన. దుబాయ్, అజ్మన్, షార్జా, ఉమ్ అల్ ఖైవాన్ నుంచి కూడా టీమ్స్ వచ్చి, అదనంగా సపోర్ట్ అందించాయని, అంబులెన్స్‌లు, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ టీమ్స్, మునిసిపాలిటీ నుంచి మరో టీమ్ సంఘటనా స్థలంలో సేవలు అందించాయని చెప్పారు. ఈ క్రమంలో ఫైర్ ఫైటర్స్ ఓ మృతదేహాన్ని సంఘటనలో కనుగొన్నట్లు వెల్లడించారు అబ్దుల్ అజీజ్ అలి అల్ షామ్షి. అగ్ని ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. మంటల్ని ఆర్పివేసిన తర్వాత ప్రమాద స్థలాన్ని అజ్మన్ పోలీస్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ ఆధీనంలోకి ఇచ్చేశామని వివరించారాయన.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల