'ఎంసిఎ' పార్టీలో సాయిపల్లవి స్టెప్స్ తో హంగామా
- December 17, 2017
నాని హీరోగా నటిస్తున్న 'ఎంసిఎ' మూవీ షూటింగ్ లో సాయి పల్లవికి నానీకి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి అని వార్తలు వచ్చిన నేపధ్యం తెలిసిందే. అయితే ఈ వార్తలతో సంబంధం లేకుండా నానీతో ఒక ఫ్యామిలీ పార్టీలో సాయి పల్లవి హంగామా చేసిన పార్టీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హడావిడి చేస్తోంది.
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే 'ఎంసిఎ' సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా ఈ సినిమా నిర్మాత దిల్ రాజ్ మరో ట్రైలర్ ను రిలీజ్ చేసాడు. ఫ్యామిలీ పార్టీ అంటూ సాగే ఈపాట భూమిక రాజీవ్ కనకాలకు సంబంధించిన ఒక ఫంక్షన్ లో జరుగుతున్నట్లు ఈ ట్రైలర్ చూసినవారికి అర్థమవుతుంది.
'ఫిదా' సినిమాలో 'వచ్చిండే.. మెల్ల మెల్లగా వచ్చిండే' అంటూ తన స్టెప్పులతో హంగామా చేసిన సాయిపల్లవి ఈపాటలో కూడ తన స్టెప్స్ తో హంగామా చేసింది. ట్రాన్స్ పోర్ట్ మాఫియాకు సంబంధించి ముఖ్యంగా ప్రైవేటు బస్సుల దోపిడీకి సంబంధించిన నేపధ్యంలో ఈ మూవీ కథను అల్లినట్లుగా తెలుస్తోంది.
ఈసినిమాకు అఖిల్ 'హలో' నుండి ఎదురౌతున్న పోటీ నేపధ్యంలో దిల్ రాజ్ ఈమూవీ ప్రమోషన్ ను చాలా వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ద్వారా ఈమూవీ పై పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసిన 'ఎంసిఎ' ఈ లేటెస్ట్ నాని ఫ్యామిలీ పార్టీ సాంగ్ తో ప్రేక్షకులలో మరింత చొచ్చుకుపోయే అవకాసం ఉంది..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల