ఔరా.. ఒక్క కౌగిలింత ఎంత పని చేసింది..?
- December 18, 2017
ఇద్దరు విద్యార్థులు బహిరంగంగా చేసుకున్న ఒక 'హగ్' ఏకంగా న్యాయవ్యవస్థనే కుదిపేసింది. కోర్టుకెకెక్కిన ఈ కేసులో చివరకు ఆ కౌగిలింతే గెలిచింది. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం సెయిట్ థామస్ స్కూల్లో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలివి. ఇంటర్మీడియేట్ చదువుతున్న ఒకబ్బాయి.. ఒకమ్మాయి.. స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ వేదిక మీద గాఢంగా కౌగిలించుకున్నారు. డజను మంది టీచర్లు, వందలాది మంది విద్యార్థులు సమక్షంలో జరిగిన ఈ 'రొమాంటిక్' సీన్.. ఆ తరువాత పెద్ద తతంగాన్నే క్రియేట్ చేసింది.
'ఇవ్వాళా రేపూ ఇదంతా కామన్' అంటూ అమ్మాయి, ఆమె పేరెంట్స్ లైట్ తీసుకున్నారు. అటు, అబ్బాయి, వాడి తల్లిదండ్రుల్లో కూడా తప్పు జరిగిందిన్న పశ్చాత్తాపం ఇసుమంతయినా లేదు. ఆ అమ్మాయి పెర్ఫామెన్స్ ని అభినందించడానికే మావాడు ఆలా చేశాడు.. అంటూ అడ్డంగా సమర్థించుకున్నారు. ఇక్కడ సమస్యంతా ఆ స్కూల్ యాజమాన్యానికి మాత్రమే స్కూల్ క్రమశిక్షణా నిబంధనల్ని ఉల్లంఘించాడని పేర్కొంటూ అతడి మీద సస్పెన్షన్ వేటు వేసింది స్కూల్ మేనేజ్మెంట్.
ఇదేమిటని ప్రశ్నించబోయిన బాబు పేరెంట్స్ మీద స్కూల్ ప్రిన్సిపాల్ రంకెలేశారు. మీవాడు అచ్చోసిన ఆంబోతులా మారాడని, పిల్లాడ్ని పెంచే పద్దతి ఇది కాదని, వీడ్నిలాగే వదిలేస్తే స్కూల్ మొత్తం గబ్బయిపోతుందని శాపనార్థాలు పెట్టిమరీ పంపించేశారు. మేం ఒకసారి హెచ్చరించినప్పటికీ.. అతడు 'హగ్' ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తించాడన్నది స్కూల్ మేనేజ్మెంట్ మోపిన అభియోగం.
దీంతో చేసేది లేక.. ఆ తండ్రి.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి ఫిర్యాదు చేసుకున్నాడు. క్రిమినల్ పీనల్ కోడ్ లోని కొన్ని సెక్షన్స్ ని ప్రస్తావిస్తూ.. పిల్లాడ్ని మళ్ళీ స్కూల్లో చేర్చుకోవాలంటూ ఆదేశాలొచ్చాయి. కానీ.. స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం ససేమిరా అంటూ హైకోర్టుకెక్కాడు. స్కూల్ డిసిప్లినరీ అంటూ ఒక కోడ్ పెట్టుకుని..
పిల్లల్ని దారిలో పెట్టాలన్న తమ చిత్తశుద్ధిని ఎలా శంకిస్తారని స్కూల్ యాజమాన్యం వాదించింది. దీంతో ఏకీభవించిన కోర్ట్ కూడా స్కూల్ విధించిన శిక్షను సమర్థిస్తూ ఆదేశాలిచ్చింది. అంతకుముందు.. క్షమాపణ పత్రం రాసిచ్చిమరీ పిల్లాడ్ని స్కూల్లో అడ్మిట్ చేసుకున్నప్పటికీ.. స్కూల్ బస్సు ఎక్కనివ్వకుండా, క్లాస్ మేట్స్ తో కలిసి పరీక్షల్ని రాయనివ్వకుండా మా వాడ్ని మరింత వేధించారని పేరెంట్స్ చెబుతున్నారు.
అయినా.. హైకోర్టు మన్నించకపోవడంతో సదరు విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీబీఎస్సీ, హైకోర్టు ఆదేశిస్తే.. ప్లస్2 ఎగ్జామ్స్ రాయించడానికి సమ్మతమేనంటూ స్కూల్ ప్రిన్సిపాల్ కాలరెగరేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







