ఎంపీలూ.. నడుం బిగించండి అంటున్న పవన్

- December 18, 2017 , by Maagulf
ఎంపీలూ.. నడుం బిగించండి అంటున్న పవన్

ఆంధ్రప్రదేశ్ ఎంపీల తీరును మరోసారి తప్పుబట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఏపీ నేతలను ఎవరు ఆపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. లాభాల్లో ఉన్న డీసీఐ (డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునేందుకు ఢిల్లీ వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని ఆయన ఎంపీలనుకోరారు.

ఈ విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని, నష్టాల్లో ఉన్నప్పటికీ, సేలం స్టీల్ ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ఆ ప్రభుత్వం అడ్డుకుంటోందని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర విభజన తరువాత అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా వంటి రాజ్యాంగ పరమైన హామీలను సైతం నెరవేర్చలేదని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com