హెల్త్‌కేర్ రంగానికి వ్యాట్ నుంచి ఊరట
- December 19, 2017
యూఏఈలో జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్న వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) నుంచి హెల్త్‌కేర్ సెక్టార్‌కి భారీ ఊరట లభించింది. పెడరల్ ట్యాక్స్ అథారిటీ వెల్లడించిన వివరాల క్రారం ప్రివెంటివ్ హెల్త్ కేర్ సర్వీసెస్, వ్యాక్సినేషన్స్, మెడికల్ మరియు డెంటల్ సర్వీసులు ఐదు శాతం వ్యాట్ నుంచి వెసులుబాటు పొందాయి. కాస్మొటిక్స్ ట్రీట్మెంట్ మాత్రం వ్యాట్ పరిధిలోకి వస్తుంది. ప్రివెంటివ్ లేదా ట్రీట్మెంట్కి సంబంధం లేని హెల్త్‌కేర్ విభాగాలకు మాత్రం 5 శాతం వ్యాట్ తప్పనిసరి. పేషెంట్ల నుంచ వ్యాట్ వసూలు చేయబడదనీ, ట్రీట్మెంట్, మెడిసిన్ ఖర్చులు, సర్జరీలు వంటివన్నీ హెల్త్ ఆఫ్ ది రెసిడెంట్స్‌కి సంబంధించినవని నిపుణులు వెల్లడిస్తున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ - నేషనల్ హాస్పిటల్ శ్రీనివాసన్ ఆచార్ మాట్లాడుతూ, హాస్పిటల్స్, డాక్టర్లు, ఫార్మసీలు అందించే వెల్‌బీయింగ్‌కి వ్యాట్ వర్తించదని చెప్పారు. అల్పెన్ క్యాపిటల్స్ జిసిసి హెల్త్‌కేర్ ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం యూఏఈ హెల్త్‌కేర్ మార్కెట్ 2020 నాటికి 71.56 బిలియన్ దిర్హామ్‌లకు చేరుకోనుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







