ప్రముఖ పాప్ సింగర్ ఆత్మహత్య..!!
- December 19, 2017
ప్రముఖ దక్షిణ కొరియన్ పాప్ స్టార్... టాప్ రాక్ బ్యాండ్స్ లో ఒకటైన షినీ టీం లో ప్రధాన గాయకుడైన కిమ్ జోంగ్ హ్యూన్ (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిమ్ మృత దేహం రాజధాని.. సియోల్ హోటల్ లో పోలీసులకు లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కొరియన్ టాప్ రాక్ బ్యాండ్స్ లో ఒకటైన షినీ టీం లో 27 ఏళ్ల కిమ్ జోంగ్ ప్రధాన గాయకుడు.. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్న కిమ్.. గత వారంలో కూడా సియోల్ లో చాలా కచేరీలు చేశాడు.. కాగా కిమ్ ఆత్మహత్య చేసుకొనే ముందు తన సోదరికి "ఇదే నా ఆఖరి ఫేర్ వెల్.. పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి.. ఇక నేను బతకలేను.. నన్ను వెళ్లనివ్వు" అని మెసేజ్ చేశాడు.. మెసేజ్ చూసిన సోదరి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే స్పందించి.. హోటల్ కి వెళ్ళి చూసేసరికి.. అప్పటికే జోంగ్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ప్రాధమిక చికిత్సను అందించినా ఫలితం లేకపోయింది. ఆ హోటల్ లో బొగ్గులాంటి పదార్ధాన్ని కాల్చి కిమ్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కిమ్ 2015 లో రిలీజ్ చేసిన "బిల్ బోర్డ్" అనే ఆల్బమ్స్ చార్ట్ లో మొదట ప్లేస్ ను దక్కించుకొన్నది.. కాగా కిమ్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడో తెలియక అతడి సోదరి.. అభిమానులు దిగ్ర్భాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







