తెలంగాణ పాలిటిక్స్‌కు..రాహుల్‌ ఫార్ములా

- December 19, 2017 , by Maagulf
తెలంగాణ పాలిటిక్స్‌కు..రాహుల్‌ ఫార్ములా

గుజరాత్‌ ఓటమి లెక్కలను విశ్లేషించే పనిలో పడ్డారు తెలంగాణ హస్తం నేతలు. గుజరాత్ ఎన్నిక‌ల ప్రచారం ఎంత సెగలు రగిల్చిందో దేశం మొత్తానికి తెలుసు.. అక్కడి ఫలితాలపైనా జోరుగా చర్చలు నడుస్తున్నాయి.. తెలంగాణలోనూ గుజరాత్‌ ఫలితాలను పొలిటికల్‌ పార్టీలు విశ్లేషిస్తున్నాయి. అక్కడి రాజకీయాలను తెలంగాణతో మిక్స్‌ చేస్తున్నారు హస్తం నేతలు. అధికారం దక్కకపోయినా కాంగ్రెస్‌ పార్టీ మోడీకి టెన్షన్‌ పుట్టించిందంటున్నారు. ప్రధానిగా ఉన్న మోడీ.. రాష్ట్ర నేతను తలపిస్తూ ప్రచారం చేశారంటూ దుయ్యబట్టారు. రాహుల్‌ను ఎదుర్కొనేందుకు మోడీ, అమిత్‌షాతోపాటు 182 మంది ప్రముఖులను దింపారని, ఓడినా నైతికంగా గెలుపు కాంగ్రెస్‌దే అంటున్నారు హస్తం నేతలు. గుజరాత్‌లో రాహుల్‌ అమల చేసిన ఫార్ములాను తెలంగాణ పాలిటిక్స్‌కు మిక్స్‌ చేశారు హస్తం నేతలు. అక్కడ హార్థిక్‌ పటేల్‌, అల్పేష్‌ ఠాకూర్‌, జిగ్నేష్‌ మేవాని త్రయం లాంటి చిత్రం 2019లో తెలంగాణలోనూ కనిపిస్తుందన్నారు. ఉద్యమ నాయకులు, సంఘాలున్నీ కాంగ్రెస్‌తో కలిసి నడుస్తాయన్నారు. మరో అడుగు ముందుకేసి గుజరాత్‌ యువత్రయాన్ని ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మందకృష్ణ, ఆర్‌.కృష్ణయ్యలతో పోల్చుతున్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ ఓడినా.. ప్రధానికి హస్తం చుక్కలు చూపించింద‌ని ఖుషీగా ఉన్న టీ కాంగ్రెస్‌  నేతలు.. అక్కడ రాహుల్ అమ‌లు చేసిన ఫార్ములాను తెలంగాణలో కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు ఉప‌యోగిస్తామ‌ని చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com