అబుదాబీ లో ట్రాఫిక్ రద్దీ సమయంలో భారీ వాహనాలు మరియు ట్రక్కులు నిషేధం

- December 21, 2017 , by Maagulf
అబుదాబీ లో ట్రాఫిక్ రద్దీ సమయంలో భారీ వాహనాలు మరియు ట్రక్కులు నిషేధం

అబుదాబి : వచ్చే నూతన సంవత్సరం జనవరి నుంచి అబుదాబీ లోనికి  ట్రాఫిక్ రద్దీ సమయంలో  రహదారులపై  భారీ వాహనాలు, ట్రక్కులను అనుమతించరు. రవాణా శాఖ సహకారంతో అబుదాబి పోలీసులు మృదువైన ట్రాఫిక్ ప్రవాహాన్నిఅందించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం అమలుచేయనున్నారు.  రోడ్లు సురక్షితమైనవి కావడంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుండి ఉదయం  9 గంటల సమయంలో రాత్రి మరియు మధ్యాహ్నం  3 గంటల నుండి సాయంత్రం  6 గంటల మధ్యకాలంలో నగరం మరియు పట్టణ శివారు ప్రాంతాలలో  ప్రవేశించకుండా హైవే పై వాహనాలు మరియు ట్రక్కులు నిషేధించబడ్డాయి. ఈ నిబంధనను అతిక్రమించి పొరబాటున ఆయా భారీ వాహనాలు, ట్రక్కులు అనుక ప్రవేశిస్తే, ప్రవేశంపై సూచనలు ఇస్తూ నగరం యొక్క ప్రధాన రహదారులపై మరియు శివార్లలో రోడ్లపై రహదారి చిహ్నాలు ఉంచబడ్డాయని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిబంధనలను పట్టించుకోకుండా నిషేధిత రహదారులలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, 1,000 దిర్హామ్లతో పాటు  నాలుగు నలుపు చుక్కలను డ్రైవింగ్ లైసెన్స్ పై ముద్రిస్తారని ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు రహదారి భద్రత డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్   అబ్దుల్ ఆల్ షెహహి చెప్పారు. రహదారిపై ట్రాఫిక్ రద్దీని మరియు ప్రమాదాలు తగ్గించడానికి మరియు రహదారి భద్రత మెరుగుపరచడానికి అబుదాబి యొక్క భూ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు డైరెక్టరేట్ యొక్క వ్యూహాత్మక ప్రణాళికలో ఈ చర్యలు అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com