హైదరాబాద్ లో ప్రేమోన్మాది అరాచకం
- December 21, 2017
నార్త్ జోన్ పరిధిలోని లాలాగూడాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించలేదని ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన ప్రేమోన్మాది. నడుచుకుంటూ వెళ్తున్న సంధ్యారాణి(22) అనే యువతిపై ప్రేమించలేదన్న కారణంతో ఓ ప్రేమికుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 70 శాతానికి పైగా కాలిపోయి తీవ్ర గాయాలయిన యువతిని గాంధి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కార్తీక్ అనే యువకుడు ఘటన జరిగిన కాసేపటికి తానే పెట్రోలు పోసి నిప్పుపెట్టినట్లు చెప్పాడు. దీంతో యువతిని ప్రేమించిన వ్యక్తే దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. ముందుగానే కార్తీక్‌పై యువతి సోదరుడు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు ఫోన్ చేసిన టవర్ లొకేషన్ లాలాగూడా పోలీసులు చేధించారు. సంధ్యారాణి శాంతినగర్ లోని లక్కీ ట్రేడర్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తోంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!