పెరగనున్న న్యాయమూర్తుల వేతనాలు.!
- December 21, 2017
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపు దిశగా ముందడుగు పడింది. న్యాయమూర్తుల వేతనాల పెంపునకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే 31 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 1,079 మంది హైకోర్టు న్యాయమూర్తులు, దాదాపు 2,500 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల వేతనాలు, ఫించన్, గ్రాట్యుటీ భారీగా పెరగనున్నాయి. వేతన పెంపు అమల్లోకి వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.2.8లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.5లక్షలు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.25 లక్షల వరకు పెరిగే అవకాశముంది. 7వ కేంద్ర పే కమిషన్ నివేదిక ఆధారంగా న్యాయమూర్తుల వేతనాలను నిర్ణయించారు. వేతన పెంపును 1 జనవరి 2016 నుంచి అమలు చేయాలని బిల్లులో పొందుపర్చారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







