అగ్నికి దగ్ధమైన ఇల్లు ..... మంటలలో మాడి మసైన శిశువు
- December 21, 2017
మస్కట్ : ఓ పసిగుడ్డు మంటలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపిన వివరాల ప్రకారం, అల్-డాఖలీయా ప్రాంతం వద్ద నిజ్వా సౌక్ లో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకొంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరికొందరు వ్యక్తులు ఇంటి లోపల మంటలలో చిక్కుకున్నారని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వారు మంటలలో తీవ్రంగా గాయపడిన ఓ పసికందుని కనుగొన్నారు. దీంతో వారు అప్రమత్తమై అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించినట్లు అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపింది. ఇంటిలో అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించిందో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







