దుబాయ్ ఫ్రేమ్: వచ్చేవారం నుంచి సందర్శకులకు అనుమతిః
- December 22, 2017
దుబాయ్:ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న దుబాయ్ ఫ్రేమ్ సందర్శనకు రంగం సిద్ధమవుతోంది. వచ్చేవారం నుంచి సందర్శకులకు దుబాయ్ ఫ్రేమ్‌ని సందర్శించే అవకాశం కలగనుంది. దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ హుస్సేన్ లూటా మాట్లాడుతూ, దుబాయ్ ఫ్రేమ్ అధికారిక ప్రారంభోత్సవం వచ్చే వారంలో జరగనున్నట్లు చెప్పారు. దుబాయ్ ఫ్రేమ్ వద్దకు పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజల్ని నిర్దేశిత సమయంలో సందర్శనకు అనుమతిస్తారు. ఈ సందర్శనకు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం యాప్‌నీ, అలాగే వెబ్‌సైట్‌నీ త్వరలో లాంఛ్ చేయబోతున్నారు. ఎటిసలాట్‌తో కలిసి వెబ్‌సైట్‌ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. 160 మిలియన్ దిర్హామ్‌లతో నిర్మించిన దుబాయ్ ఫ్రేమ్ ప్రాజెక్ట్, సందర్శకులకు 360 డిగ్రీల కోణంలో దుబాయ్‌ని చూసే అవకాశం కల్పిస్తుంది. 150 మీటర్ల ఎత్తయిన రెండు టవర్స్, పాస్ట్ మరియు ప్రెజెంట్ దుబాయ్‌ని కనెక్ట్ చేయనుంది. ఈ సందర్శన కోసం పెద్దల నుంచి 50 దిర్హామ్‌లు వసూలు చేయనుండగా, పిల్లలకు 30 దిర్హామ్‌లు వసూలు చేస్తారు. మూడేళ్ళ లోపు చిన్నారులకు, 60 ఏళ్ళు పైబడ్డ వృద్ధులకు ప్రవేశం ఉచితం. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కి కూడా ఉచిత ప్రవేశమే.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!