బహ్రెయిన్లోనూ వ్యాపించిన సాల్మనెల్లా భయం
- December 22, 2017
మనామా: లాక్టాలిస్ గ్రూప్, మరో రెండు బేబీ మిల్క్ ప్రోడక్ట్స్‌ని స్థానిక మార్కెట్ నుంచి ఉపసంహరించింది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్ళు వీటిల్లో కన్పిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సర్వత్రా ఆందోళన తీవ్రతరమవుతోంది. వివిధ దేశాల్లో ఇప్పటికే ఈ సాల్మనెల్లా బ్యాక్టీరియా పట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ తమ ఉత్పత్తుల్ని మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నాలుగు రకాలైన బ్యాచ్‌లకు సంబంధించిన మిల్క్ ప్రోడక్ట్స్‌ని రీకాల్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తాజాగా వెనక్కి తీసుకున్న బ్యాచెస్ స్థానంలో, కొత్త ప్రోడక్ట్స్‌ని మార్కెట్లోకి దించుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంస్థ ప్రకటించింది. పూర్తిస్థాయిలో ధృవీకరణ పరీక్షల అనంతరం వీటిని మార్కెట్లోకి తెస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ విషయంలో తమ సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని సంస్థ ప్రతినిథుల వివరించారు. అయితే పసిపిల్లలకు ప్రత్యామ్నాయ ఆహారంగా ఎంతో పేరొందిన ఈ తరహా ప్రోడక్ట్స్ విషయంలో ఇలాంటి అనుమానాలు రావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల