బహ్రెయిన్‌లోనూ వ్యాపించిన సాల్మనెల్లా భయం

- December 22, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లోనూ వ్యాపించిన సాల్మనెల్లా భయం

మనామా: లాక్టాలిస్‌ గ్రూప్‌, మరో రెండు బేబీ మిల్క్‌ ప్రోడక్ట్స్‌ని స్థానిక మార్కెట్‌ నుంచి ఉపసంహరించింది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్ళు వీటిల్లో కన్పిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సర్వత్రా ఆందోళన తీవ్రతరమవుతోంది. వివిధ దేశాల్లో ఇప్పటికే ఈ సాల్మనెల్లా బ్యాక్టీరియా పట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ తమ ఉత్పత్తుల్ని మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, నాలుగు రకాలైన బ్యాచ్‌లకు సంబంధించిన మిల్క్‌ ప్రోడక్ట్స్‌ని రీకాల్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తాజాగా వెనక్కి తీసుకున్న బ్యాచెస్‌ స్థానంలో, కొత్త ప్రోడక్ట్స్‌ని మార్కెట్‌లోకి దించుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంస్థ ప్రకటించింది. పూర్తిస్థాయిలో ధృవీకరణ పరీక్షల అనంతరం వీటిని మార్కెట్‌లోకి తెస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫుడ్‌ సేఫ్టీ విషయంలో తమ సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని సంస్థ ప్రతినిథుల వివరించారు. అయితే పసిపిల్లలకు ప్రత్యామ్నాయ ఆహారంగా ఎంతో పేరొందిన ఈ తరహా ప్రోడక్ట్స్‌ విషయంలో ఇలాంటి అనుమానాలు రావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com