జెట్‌ ఎయిర్ వేస్ డిస్కౌంట్‌ ఆఫర్‌.!

- December 22, 2017 , by Maagulf
జెట్‌ ఎయిర్ వేస్ డిస్కౌంట్‌ ఆఫర్‌.!

కొత్త సంవత్సరం కానుకగా డిస్కౌంట్‌ ఆఫర్లతో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రయాణికుల ముందుకు వస్తున్నాయి. ప్రైవేట్‌ క్యారియర్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌, న్యూఇయర్‌ సేల్‌ స్కీమ్‌ను నేడు ప్రకటించింది. ఈ స్కీమ్‌ కింద ఎకానమీలో బేస్‌ ఫేర్స్‌కు 10 శాతం డిస్కౌంట్‌, దేశీయ సెక్టార్‌లో బిజినెస్‌ క్లాస్‌ టిక్కెట్లకు 15 శాతం డిస్కౌంట్లను జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫర్‌ చేస్తోంది.

డిసెంబర్‌ 13 నుంచి జనవరి 2 వరకు 11 రోజుల పాటు ఈ సేల్‌ కింద టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ప్రయాణ కాలం 2018 జనవరి 15 నుంచి ప్రారంభమవుతుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ శుక్రవారం ప్రకటించింది. 44 దేశీయ నెట్‌వర్క్‌ సర్వీసులకు ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. వన్‌-వే ఎకానమీ టిక్కెట్‌ రూ.1,001 నుంచి ప్రారంభమవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com