ఎడారిలో మోటార్ బైక్ ప్రమాద బాధితుడిని హెలికాఫ్టర్ ద్వారా తరలించిన అబుదాబి ఎయిర్ వింగ్

- December 22, 2017 , by Maagulf
ఎడారిలో మోటార్ బైక్  ప్రమాద బాధితుడిని  హెలికాఫ్టర్ ద్వారా తరలించిన అబుదాబి ఎయిర్ వింగ్

అబుదాబి : ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినపుడు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించే అమృత ఘడియలలో ఏమాత్రం జాప్యం జరిగితే అమూల్యమైన ప్రాణాలు గాల్లో కల్సిపోతాయనేది సత్యం. ఆ సమయంలో అవసరమైన వనరులను సక్రమంగా వినియోగించుకొంటే బాధితులు రక్షించబడతారు. అల్ ఐన్ ఎడారి ప్రాంతంలో ఓ 27 ఏళ్ళ యువకుడి  మోటార్ బైక్ ఇసుకలో కూరుకుపోయింది. ప్రమాదంలో గాయపడి ఎడారిలో ఏకాకిగా మిగిలిన యువకుడిని హెలికాఫ్టర్ ద్వారా అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఓ యువకుడు ఎడారిలో చిక్కుకున్నట్లు ఫోన్ ద్వారా సమాచారం అందుకొన్న అబుదాబీ పోలీసులు అప్రమత్తమై వెంటనే సన్నివేశంలో హెలికాప్టర్ ను  పంపించారు. "అబూ ధాబీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు ఎడారిలో  మోటార్ బైక్ మలుపు విపరీతంగా తిరిగిన తర్వాత అరబ్ జాతయుడైన ఆ యువకుడు స్వల్పంగా గాయపడ్డారు. దాంతో ఎయిర్ వింగ్ త్వరగా  స్పందించి గాయపడిన మోటారు బైక్ యువకుడిని గుర్తించగలిగింది. వెనువెంటనే ఆ స్థలంలో హెలికాఫ్టర్ కిందకు దిగి ఓ మోస్తరుగా గాయపడిన యువకుడిని తీసుకొని ఆకాశమార్గాన ఆసుపత్రికి తరలించింది. అబుదాబి పోలీసులు స్పందించిన తీరు పట్ల ప్రజలలో హర్షాతీరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంఘటనలో పోలీసులు మానవీయకోణంలో వ్యవహరించడం మా ప్రతిస్పందన పట్ల పలువురు అభినందిస్తున్నట్లు అబుదాబి ఎయిర్ వింగ్ అధిపతి బ్రిగ్ జెన్ హాసన్ ఆల్ బెలోషీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com